DRDO : స్వదేశీ పవర్ టేకాఫ్ షాఫ్ట్ విజయవంతం

Update: 2023-03-15 03:55 GMT

లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ లో పవర్ టేకాఫ్ (PTO) షాఫ్ట్ విజయవంతమైందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకుగాను మంగళవారం ఓ ప్రకటన చేసింది. పీటీఓ షాఫ్ట్ ను చెన్నైకి చెందిన కంబాట్ వెహికిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్, ఢిఫెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా రూపొందించాయి. PTO షాఫ్ట్ ను LAC తేజస్ లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ -3 (LSP-3) విమానంతో పరీక్షించారు. PTO అనేది ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ నుంచి గేర్ బాక్స్ కు శక్తిని ప్రసారం చేసే కీలకమైన పరికరం. ఇది భవిష్యత్ యుద్ద విమానాలు, వాటి వేరియంట్ ల అవసరాలకు మద్దతును ఇస్తుంది.  

"ఈ విజయవంతమైన పరీక్షతో కొన్ని దేశాలు మాత్రమే సాధించిన సంక్లిష్టమైన హై స్పీడ్ రోటర్ టెక్నాలజీని గ్రహించడం ద్వారా డీఆర్డీఓ ఒక గొప్ప సాంకేతిక ఫీట్ ను సాధించింది. పీటీఓ షాఫ్ట్ ఒక ప్రత్యేకమైన వినూత్న పేటెంట్ కలిగిన ఫ్రీక్వెన్సీ స్పానింగ్ టెక్నిక్ తో రూపిందించబడింది. ఇది  ఇంజన్ల వేగాన్ని అదుపులో ఉంచగలదు" అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీఓ సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమను అభినందించారు. పీటీఓ షాఫ్ట్ విజయవంతంగా అమలులోకి రావడం ఆత్మనిర్భర్ భారత్ కు మరో ప్రధాన మైలురయని అన్నారు. డీఆర్డీఓ ఛైర్మన్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ, ఈ విజయం దేశం యొక్క పరిశోధనా సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయించిందని తెలిపారు.  టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లకు పీటీఓ చురుకుగా మద్దతును ఇస్తుందని చెప్పారు. 

Similar News