CBN: గంగా-కావేరి అనుసంధానం నా జీవిత లక్ష్యం

సాగునీటి రంగంపై ఏపీ శాసనసభలో చర్చ...నీటిని పూజించే సంప్రదాయం మనదన్న సీఎం... గంగా-కావేరి అనుసంధానిస్తామన్న చంద్రబాబు

Update: 2026-02-26 10:00 GMT

ప్ర­కృ­తి­ని పూ­జిం­చే సం­స్కృ­తి భా­ర­తీ­యు­ల­ది, నదు­ల­ను తల్లు­లు­గా భా­విం­చే సం­ప్ర­దా­యం తె­లు­గు ప్ర­జ­ల­ది అని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు పే­ర్కొ­న్నా­రు. శా­స­న­స­భ­లో సా­గు­నీ­టి రం­గం­పై జరి­గిన వి­స్తృత చర్చ సం­ద­ర్భం­గా ఆయన ప్ర­సం­గి­స్తూ, నదుల అను­సం­ధా­నం తన చి­ర­కాల స్వ­ప్న­మ­ని వె­ల్ల­డిం­చా­రు. గో­దా­వ­రి­కి అఖండ హా­ర­తి, కృ­ష్ణా నది­కి పవి­త్ర హా­ర­తి ఇచ్చిన సం­ద­ర్భా­ల­ను గు­ర్తు చే­స్తూ, నీటి వన­రుల పరి­ర­క్షణ, వి­ని­యో­గం వి­ష­యం­లో తమ ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని తె­లి­పా­రు. “గంగా-కా­వే­రి అను­సం­ధా­నం నా ప్ర­గాఢ ఆకాం­క్ష. చి­న్న ఆలో­చ­న­లే పె­ద్ద మా­ర్పు­ల­కు దారి తీ­స్తా­యి. నదుల అను­సం­ధా­నం ద్వా­రా దే­శం­లో నీటి సమ­స్య­ల­కు శా­శ్వత పరి­ష్కా­రం లభి­స్తుం­ది” అని సీఎం పే­ర్కొ­న్నా­రు. వం­శ­ధార నుం­చి పె­న్నా వరకు నదు­ల­ను అను­సం­ధా­నం చే­య­గ­లి­గి­తే రా­ష్ట్రం­లో నీటి కొరత పూ­ర్తి­గా తొ­ల­గి­పో­తుం­ద­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు. నదు­ల­ను కలి­పి ‘తె­లు­గు­త­ల్లి­కి జల­హా­ర­తి’ ఇవ్వ­డం తమ బా­ధ్య­త­గా భా­వి­స్తు­న్నా­మ­ని అన్నా­రు. రా­ష్ట్రం­లో ని­ర్మిం­చ­బ­డిన ప్ర­ధాన సా­గు­నీ­టి ప్రా­జె­క్టుల గు­రిం­చి వి­వ­రిం­చిన ఆయన, పట్టి­సీమ ద్వా­రా గో­దా­వ­రి నుం­చి కృ­ష్ణా­కు 100 టీ­ఎం­సీల నీ­టి­ని తర­లిం­చిన వి­ష­యా­న్ని గు­ర్తు చే­శా­రు. శ్రీ­శై­లం నుం­చి రా­య­ల­సీ­మ­కు నీ­టి­ని అం­దిం­చా­మ­ని, వె­లి­గొండ ప్రా­జె­క్టు­కు తానే శం­కు­స్థా­పన చేసి ఇప్పు­డు పూ­ర్తి చేసే దశకు తీ­సు­కొ­చ్చా­న­ని తె­లి­పా­రు. జూ­లై­లో వె­లి­గొండ ఫేజ్-1 నుం­చి నీటి వి­డు­దల జరు­గు­తుం­ద­ని ప్ర­క­టిం­చా­రు. ఈ ప్రా­జె­క్టు­కు 14 వా­రాల గడు­వు వి­ధిం­చా­మ­ని, ప్ర­తి వారం పు­రో­గ­తి ని­వే­ది­క­ను స్వ­యం­గా సమీ­క్షి­స్తా­న­ని వె­ల్ల­డిం­చా­రు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పురోగతి సాధించలేదని విమర్శించారు. గత పాలకులు రూ.2,500 కోట్ల పనులు పెండింగ్‌లో ఉంచి ‘జాతికి అంకితం’ అంటూ ప్రచారం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై సుమారు రూ.20 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధిపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాయలసీమను రాళ్లసీమగా మారకుండా దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారని చెప్పారు. రాయలసీమకు నీరు అందించిన తర్వాతే చెన్నైకి నీటిని తరలించామని వివరించారు. రాష్ట్రంలోని అనేక కీలక ప్రాజెక్టులు ఎన్డీయే లేదా తెలుగుదేశం హయాంలోనే పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ఈ టర్మ్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కంటే ముందే ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలవరం నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, ఎమ్మెల్యేలంతా ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 66 ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు.

Tags:    

Similar News