దేశంలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.;
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. తాజా ఆదివారం ఉదయం 6.38 గంటల సమయంలో నికోబార్ దీవుల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టార్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించిందని అన్నారు. అటు, ఈశాన్య భారత్ లో కూడా భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్ లో రిక్టార్ స్కేలుపై 3.4 తీవ్రతతో ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో భూకంపం ఏర్పడింది. అయితే, రెండు ప్రాంతాల్లో ఏర్పడిన భూకంపం వలన నష్టం ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా సమయంలో దేశంలో వరుస భూకంపాలు సంభవించండం స్థానికప్రజల్లతో అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.