ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలనుద్దేశించి  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు.;

Update: 2021-01-29 10:30 GMT

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సం.కు V షేప్ రికవరీ ఉందని ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఇక GDP వృద్ధిరేటు 7.7%గాఉండనుందని సర్వే తెలిపింది. అటు 2021-22 ఆర్థిక సం.లో GDP 11%గా ఉంటుందని అంచనా వేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందనుందని సర్వే అభిప్రాయపడింది. కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని  సర్వే  సూచించింది.అటు సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్ సభను ఫిబ్రవరి 1 ఉదయం గం.11కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.

Tags:    

Similar News