బ్రేకింగ్.. కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు అంగీకారం

చిత్తశుద్ధితో కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నాయి రైతు సంఘాలు.

Update: 2020-12-26 12:37 GMT

ప్రతీకాత్మక చిత్రం 

కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు అంగీకరించాయి. మొత్తం 40 రైతు సంఘాలు ఈ మేరకు.. కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశాయి. ఈ నెల 29న కేంద్రంతో చర్చలు సిద్ధమని అందులో తెలిపాయి. డిసెంబర్ 29 ఉదయం 11 గంటలకు చర్చలకు వస్తామంటూ కేంద్రవ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌కు లేఖ రాశారు. మొత్తం 4 అంశాల ఎజెండాపై చర్చించేందుకు సిద్ధమంటూ లేఖలో వెల్లడించారు.

ఇందులో మొదటి అజెండా.. మూడు వ్యవసాయ చట్టలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించాలని లేఖలో కోరారు. ఇక రెండో అజెండగా.. అన్ని రంకాల పంటలకు జాతీయ కమిషన్‌ సూచించిన లాభదాకమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చించాలని కోరారు. ఇక మూడో అజెండాగా.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని వాయు నాణ్యత నిర్వహణ కోసం.. ఏర్పాటు చేసిన కమిషన్‌ ఆర్డినెన్స్‌కు సవరణ చేయాలని కోరారు. ఈ ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుంచి రైతులను మినహాయించాలని లేఖలో కోరారు. ఇక నాలుగో అజెండగా.. రైతుల ప్రయోజనాలను పరీరక్షించేందుకు విద్యుత్‌ సవరణ బిల్లు 2020 ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడంపై చర్చలు జరపాలని కోరారు. చిత్తశుద్ధితో కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నాయి రైతు సంఘాలు.


Tags:    

Similar News