ఉత్తరాఖండ్‌లోని కన్‌స్రో వద్ద భారీ అగ్నిప్రమాదం..!
ఢిల్లీ - డెహ్రడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ప్రయాణీకులందరూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.;
ఢిల్లీ - డెహ్రడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ప్రయాణీకులందరూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో సీ4 కంపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుండి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. ఉత్తరాఖండ్‌లోని కన్‌స్రో వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అధికారులు... ప్రయాణీకుల్ని అప్రమత్తం చేసి అందరినీ కిందకు దింపారు. దీంతో భారీ ముప్పు తప్పింది. ప్రయాణీకులందరిని సరక్షితంగా కాపాడినట్లు తెలిపారు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు.