Karnataka CM : కర్ణాటక సీఎంకి తప్పిన ప్రమాదం.. అరగంట పాటు..
Karnataka CM : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న విమానం ల్యాండయ్యే సమయంలో ఇబ్బంది ఎదురైంది.;
Karnataka CM : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న విమానం ల్యాండయ్యే సమయంలో ఇబ్బంది ఎదురైంది.. ప్రతికూల వాతావరణం కారణంగా అరగంట పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి హూబ్లీకి బయలుదేరిన ఈ విమానం ఉదయం 7.30కి ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఇరువై నిముషాలు ఆలస్యమైంది. 'నేను ఓటు వేయడానికి వచ్చాను. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం ఆలస్యమైంది' అని బొమ్మై వెల్లడించారు. కర్ణాటకలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హవేరీ జిల్లాలోని శిగ్గావ్లో సీఎం శుక్రవారం తన ఓటును వినియోగించుకున్నారు బొమ్మై.