Mumbai : యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న తొలి విమానం..!
Mumbai : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతో బయల్దేరిన ఫస్ట్ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితం ముంబైకి చేరుకుంది.;
Mumbai : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతో బయల్దేరిన ఫస్ట్ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితం ముంబైకి చేరుకుంది. మధ్యాహ్నం రొమేనియా క్యాపిటల్ బుచారెస్ట్ నుంచిబయల్దేరిన ఎయిరిండియా విమానం...కాసేపటి క్రితం ముంబైలో ల్యాండ్ అయింది. మొత్తం ఈ విమానంలో 219 మంది ప్రయాణికులు ఇండియాకు సురక్షితంగా తిరిగివచ్చారు. వీరిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలంచేందుకు రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రేపు ఉదయం మరో విమానం కూడా ఇండియాకు రానుంది. ఒక్కో విమానంలో 235 నుంచి 240 మంది విద్యార్థులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Welcome back.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 26, 2022
First step of #OperationGanga. https://t.co/4DgLIc7GYM