మమతాకి షాక్.. బీజేపీలోకి యువ ఎమ్మెల్యే!
పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది.;
పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన యువ ఎమ్మెల్యే ఆరిందమ్ భట్టాచార్య తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పిసి బీజేపీలో చేరారు.
ఈ రోజు సాయింత్రం బీజేపీ పశ్చిమబెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయవర్గీయ సమక్షంలో అయన బీజేపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆరిందమ్ భట్టాచార్య పశ్చిమబెంగాల్‌లోని శాంతిపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున శాంతిపూర్ నియోజకవర్గం నుంచి పోటి చేసి గెలిచిన ఆరిందమ్ భట్టాచార్య.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
కాగా, సీనియర్ నాయకులు సువేందు అధికారి లాంటి పలువురు నేతలు తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.