Ajit Singh : కరోనాతో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ మృతి..!
తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్(82) కన్నుమూశారు.;
దేశవ్యాప్తంగా కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వైరస్ బారిన పడి చనిపోతున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతుంది. అందులో భాగంగానే తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్(82) కన్నుమూశారు. గత నెల ఏప్రిల్ 20న కరోనా బారిన పడిన ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అజిత్ సింగ్ ఎవరో కాదు... దేశ మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడు.. అజిత్‌సింగ్.. రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పని చేశారు. యూపీఏ హయాంలో ఆయన పౌర విమానయాన మంత్రిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రముఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలగు వారు సంతాపం తెలుపుతున్నారు.