Free Wi-fi : 6000 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు..!
Free Wi-Fi : భారతీయ రైల్వే మరో మైలురాయిని చేరుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సేవలు ఇప్పటివరకు 6వేల స్టేషన్లకు చేరాయి.;
Free Wi-Fi : భారతీయ రైల్వే మరో మైలురాయిని చేరుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సేవలు ఇప్పటివరకు 6వేల స్టేషన్లకు చేరాయి. 2016లో ముంబై రైల్వే స్టేషన్‌లో మొదటి వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని మిదాన్ పూర్ స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలందించడం ద్వారా 5 వేల మార్కు చేరుకుంది. జార్ఖండ్ లోని హజారీబాగ్ టౌన్ రైల్వేస్టేషన్లో వైఫైను ఏర్పాటు చేయడంతో 6వేల మార్కును అందుకుంది. గూగుల్, డాట్, పీజీసీఐఎల్ టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో భారతీయ రైల్వే ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తోంది. వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో స్టేషన్‌లో ఉన్నవారెవరైనా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు.