Bipin Rawat Brother : బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు..!
Bipin Rawat Brother : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.;
Bipin Rawat Brother : గత నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్ విజయ్ రావత్ ఉత్తరాఖండ్‌లో ఈ రోజు బీజేపీలో చేరారు.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. సైన్యంలో కల్నల్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన విజయ్ రావత్.. ప్రధాని మోదీ ఆలోచన విధానం నచ్చే బీజేపీలో చేరినట్టుగా వెల్లడించారు. త్వరలో ఉత్తరాఖండ్‌లో జరగబోయే ఎన్నికల్లో విజయ్ రావత్ ని బరిలో దింపే అవకాశం లేకపోలేదు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
I like his (Uttarakhand CM) vision for State. It matches what my brother (late CDS Bipin Rawat) had in his mind. BJP has same mindset. In case they ask me, I'll serve people of Uttarakhand (will you join BJP?): Late CDS Gen Bipin Rawat's brother Colonel Vijay Rawat (retired) https://t.co/6U7uBLWphR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 19, 2022