CDS : బిపిన్ రావత్ స్థానంలో మ‌నోజ్ ముకుంద్?

CDS : తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే..

Update: 2021-12-09 04:01 GMT

CDS : తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.. నేడు ఢిల్లీకి ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలావుండగా బిపిన్ రావత్ మరణంతో తదుపరి CDS ఎవరనే చర్చ నడుస్తోంది. ఇంతటి విషాదకరమైన సమయంలో భద్రత విషయంలో రాజీపడరాదనే సూత్రాన్ని అనుసరిస్తూ ప్రధాని మోదీ అత్యవసర క్యాబినెట్ భేటి నిర్వహించి తరవాత CDS నియామకం పై చర్చించినట్లు సమాచారం.

ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణేను తదుపరి CDSగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వైఎస్ CDSగా ఉన్న ఎయిర్ మార్షల్ రాధాకృష్ణ పేరును కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఆర్మీ చీఫ్​గా వచ్చే ఏడాది ఏప్రి​లో నరవాణె పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే సవరించి ఆర్మీ నిబంధనల ప్రకారం.. సీడీఎస్​ 65 ఏళ్లు వచ్చే వరకు సేవలందించే అవకాశముంది. వాస్తవానికి వచ్చే ఏడాది సీడీఎస్ పదవి నుంచి జనరల్ బిపిన్ రావత్​కూడా రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే ఇలా జరగడంతో తదుపరి సీడీఎస్​ ఎంపికపై ముందస్తుగా కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

Tags:    

Similar News