మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్‌పై సంకేతాలతో కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం.

Update: 2020-09-30 10:43 GMT

కొద్ది సెషన్స్‌లో వరుసగా తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకింది. రూపాయ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. యల్లోమెటల్‌ రూ 50,000 మార్క్‌ దాటింది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్‌పై సంకేతాలతో కూడా బంగారం ధరలు పెరగడానికి కారణం. ఇక ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 287 రూపాయలు పెరిగి 50,420 రూపాయలకు చేరింది. అటు కిలో వెండి కూడా 995 రూపాయలు పెరిగి 61,391 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ 1.56 డాలర్లు ఎగబాకి ఔన్స్‌కు 1882 డాలర్లుగా నమోదైంది.

courtesy: https://www.profityourtrade.in

Similar News