బంగారం ధర మళ్లీ పైపైకి

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ గోల్డ్‌ కొండెక్కుతుంది.

Update: 2020-09-16 10:58 GMT

పసిడి, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీ నేపథ్యంలో బంగారం రేటు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ గోల్డ్‌ కొండెక్కుతుంది. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 471 పెరిగింది. దీంతో 10 గ్రామాల బంగారం రూ.52158 రూపాయలకు చేరింది.

ఇక కిలో వెండి 855 రూపాయలు ఎగబాకింది. 69,820 రూపాయలకు చేరింది. డాలర్‌ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు గోల్డ్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌ 1962.78 డాలర్లగా పెరిగింది. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఇవాళ తీసుకునే నిర్ణయాలపై బంగారం ధరల భవిష్యత్తు ఉంటుంది. 

Tags:    

Similar News