బంగారం ప్రియులకు పండగ.. భారీ పతనం

కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు వినియోగదారులు.

Update: 2020-10-09 05:17 GMT

బంగారం, వెండి ధరల్లో గత నాలుగు రోజు భారీ పతనం కనబడుతోంది. దాదాపు మూడు నెలల తరువాత బంగారం పది గ్రాముల ధర మరోసారి రూ.50 వేల కన్నా తక్కువకు చేరుకుంది. నిజానికి పసిడి ప్రియులు పండుగ సీజన్ కోసం వేచి చూస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు వినియోగదారులు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం, అక్టోబర్ 8,2020న ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,357 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,127 పలుకుతోంది.

ఇక వెండి విషయానికి వస్తే ఎంసిఎక్స్‌లో కిలో వెండి ధర 0.23 శాతం తగ్గి రూ.60,280కు చేరుకుంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకే శ్రేణిలో ట్రేడవుతున్నాయి. వెండి ధర అత్యున్నత స్థాయి నుండి పతనమవుతున్నాయి. అమెరికా ఎన్నికలకు ముందు బంగారం ధరల్లో మార్పు కనబడుతుంది. ఈ ఏడాది మొదటి నెలల్లో బంగారం 30 శాతం పెరిగిందని, కానీ సెప్టెంబర్‌లో డాలర్ పెరగడంతో వేగం మందగించింది. కానీ పండుగ సీజన్‌లో భారతదేశంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

దీపావళి-ధంతేరాస్ పండుగలకు బంగారం కొనే అనవాయతీని భారతీయులు కొనసాగిస్తారు. బంగారం నిల్వలో భారతదేశం ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ఇది మొత్తం విదేశీ మారక నిల్వలలో 7.4 శాతం. ఈ ఏడాది ఆగస్ట్ 7న 10 గ్రాముల బంగారం ధర రూ.56,200 పలకగా, ఈ మూడు నెలల్లో రూ.6,000 తగ్గింది. భవిష్యత్తులో మరింత పతనం అయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జర్మనీ, ఇటలీ ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి భారీ పతనానికి గురి చేసింది. దీంతో ఓపెన్ మార్కెట్లో ఆయా దేశాలు తమ పసిడి నిల్వలను విడుదల చేసే అవకాశం ఉంది. 

Tags:    

Similar News