పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి కానుక..
మొదటి విడత నగదును దీపావళి నాటికి వారి అకౌంట్లలో జమచేయనుంది.;
ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ సబ్‌స్ర్కైబర్లకు గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతోంది. పండగ సీజన్‌లో పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ రేటు అందిస్తామని ఈపీఎఫ్‌వో గతంలోనే ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకే సారి కాకుండా రెండు విడతలుగా జమ చేయాలనుకుంటోంది ఈపీఎఫ్. అందులో భాగంగానే మొదటి విడత నగదును దీపావళి నాటికి వారి అకౌంట్లలో జమచేయనుంది. మిగిలిన మొత్తాన్ని డిసెంబర్ చివరి నాటికి పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. ఇక ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో చూసుకునేందుకు పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత పాస్‌బుక్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది.