గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధరపై రూ.500 వరకు తగ్గింపు..
గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఇకపై ప్రతివారం ఉంటాయని నివేదికలు వెలువడుతున్నాయి;
ప్రముఖ డిజిటల్ చెల్లిపుల సంస్థ గూగుల్ పే తన కస్టమర్లకు శుభవార్త అందించింది. గ్యాస్ బుకింగ్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. గూగుల్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.10 నుంచి రూ.500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు కనీసం గూగుల్ పే ద్వారా రూ.500 లావాదేవీ నిర్వహించి ఉండాలి. స్కాచ్ కార్డు రూపంలో మీకు ఈ డబ్బులు లభిస్తాయి.
గూగుల్ పే ఒక్కటే కాదు మరి కొన్ని పేమెంట్ యాప్‌లు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు అందిస్తున్నాయి. పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై రూ.30 తగ్గింపు అందిస్తోంది. కాగా, గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఇకపై ప్రతివారం ఉంటాయని నివేదికలు వెలువడుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.