Kedarnath temple : శివనామస్మరణ మధ్య తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం..!

Kedarnath temple : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు యాత్రికుల కోసం తెరుచుకున్నాయి.

Update: 2022-05-06 09:30 GMT

Kedarnath temple : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు శుక్రవారం (మే 6, 2022) వేద మంత్రోచ్ఛారణలు, శివనామస్మరణల మధ్య యాత్రికుల కోసం తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయంలో తన భార్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ పునప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా అధికారులు కేదార్‌నాథ్ ఆలయానికి రోజుకు 12,000 మందిని మాత్రమే అనుమతించనున్నారు. కాగా అక్షయ తృతీయ సందర్భంగా మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర కూడా ప్రారంభమైంది.

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈచార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావడం విశేషం. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి ధామ్‌ ఆలయాలు తెరుచుకోగా, మే 08న బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనుంది. చార్‌ ధామ్‌ యాత్రకు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ లేదా కోవిడ్‌ టీకా సర్టిఫికేట్‌ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది.



Tags:    

Similar News