SIT: సుప్రీం అంటే మీరేనా..కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్

నాలుగున్నర గంటల పాటు కేసీఆర్ విచారణ... నందినగర్‌లో కేసీఆర్‌ను విచారించిన సిట్... విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డ్

Update: 2026-02-02 03:15 GMT

ఫోన్ ట్యా­పిం­గ్ కే­సు­లో బీ­ఆ­ర్‌­ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్‌­ను సిట్ సు­దీ­ర్ఘం­గా వి­చా­రిం­చిం­ది. నం­ది­న­ర­గ్‌­లో­ని ని­వా­సం­లో సు­మా­రు 4 గంటల 45 ని­మి­షా­ల­కు­పై­గా అధి­కా­రు­లు కే­సీ­ఆ­ర్‌­ను వి­చా­రిం­చా­రు. ఇది­వ­ర­కూ వి­చా­రిం­చిన వారు పే­ర్కొ­న్న అం­శా­ల­పై అధి­కా­రు­లు గు­లా­బీ బా­స్‌­ను ప్ర­శ్నిం­చి­న­ట్టు సమా­చా­రం. వి­చా­రణ మొ­త్తా­న్ని అధి­కా­రు­లు ఆడి­యో, వీ­డి­యో రి­కా­ర్డిం­గ్ చే­శా­రు. కే­సీ­ఆ­ర్‌­కు రెం­డో­సా­రి నో­టీ­సు­లు జారీ చే­సిన సిట్ అధి­కా­రు­లు ఆది­వా­రం వి­చా­రణ పూ­ర్తి చే­శా­రు. నం­ది­న­గ­ర్‌­లో­ని ని­వా­సం రెం­డో అం­త­స్తు­లో­ని గది­లో మధ్యా­హ్నం 3 గం­ట­ల­కు వి­చా­రణ మొ­ద­లైం­ది. నా­లు­గ్గం­టల 45 ని­మి­షాల వి­చా­రణ అనం­త­రం కే­టీ­ఆ­ర్, హరీ­శ్ రావు, ఆర్‌­ఎ­స్ ప్ర­వీ­ణ్ కు­మా­ర్‌­ల­తో కే­సీ­ఆ­ర్ మా­ట్లా­డా­రు.

కీలక ప్రశ్నలు

విచారణలో భాగంగా అధికారులు పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ‘సుప్రీం, పెద్దాయన’ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఈ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సిట్ అధికారులు కేసీఆర్ ముందు ప్రస్తావించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీం, పెద్దాయన అంటే మీరేనా అని కేసీఆర్‎ను ప్రశ్నించినట్లు తెలిసింది. రిటైర్డ్ అయిన అధికారులను ఎందుకు పదవుల్లో కొనసాగించారు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్ రావుతో మీరెప్పుడైనా మాట్లాడారా.. ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలపై మాట్లాడారు.. ఫోన్ ట్యాపింగ్ డేటాను మీకు ఎవరూ అందజేశారు వంటి అంశాలపై సిట్ అధికారులు కేసీఆర్‎పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన వీడియోలు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది. నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ను ఆరుగురు అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎదుట అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్‌ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణని ముగించుకున్న అనంతరం కేసీఆర్‌ నివాసం నుంచి సిట్‌ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయనే విషయంపై, నిర్ణయ ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 ఫోన్ ట్యాపింగ్ ఎప్పటినుంచి మొదలైంది..

ఫోన్ ట్యా­పిం­గ్ చే­య­మ­ని ఆదే­శా­లు జారీ చే­శా­రా..? అని కే­సీ­ఆ­ర్‌­ని నే­రు­గా ప్ర­శ్నిం­చా­రు. ‘ఫోన్ ట్యా­పిం­గ్ చే­య­మ­ని ఇం­టె­లి­జె­న్స్ అధి­కా­రు­ల­కు మీరు స్వ­యం­గా ఆదే­శా­లు జారీ చే­శా­రా?’ అనే ప్ర­శ్న­ను స్ప­ష్టం­గా అడి­గి­న­ట్లు సమా­చా­రం. ఈ అం­శం­పై కే­సీ­ఆ­ర్ నుం­చి క్లా­రి­టీ తీ­సు­కు­నేం­దు­కు సిట్ అధి­కా­రు­లు తీ­వ్రం­గా ప్ర­య­త్నిం­చి­న­ట్లు తె­లి­సిం­ది. ఏ సం­వ­త్స­రం నుం­చి ఫోన్ ట్యా­పిం­గ్ మొ­ద­లైం­ది..? అనే వి­ష­యా­ల­పై సిట్ అధి­కా­రు­లు ప్ర­త్యే­కం­గా ఆరా తీ­శా­రు. ‘ఏ సం­వ­త్స­రం నుం­చి ఫోన్ ట్యా­పిం­గ్ చే­య­మ­ని చె­ప్పా­రు?, అది సా­ధా­రణ భద్రత కో­స­మా..? లేక రా­జ­కీయ అవ­స­రాల కో­స­మా..?’ అంటూ పలు ప్ర­శ్న­లు వే­సి­న­ట్లు సమా­చా­రం. ఎన్ని­క­ల­కు ముం­దు ప్ర­తి­ప­క్ష నేతల ఫో­న్లు ట్యా­ప్ చే­శా­రా..?.. వారి ఫో­న్లు ట్యా­ప్ చే­య­మ­ని ఆదే­శా­లు ఇచ్చా­రా..? అంటూ సిట్ అధి­కా­రు­లు నే­రు­గా ప్ర­శ్నిం­చా­ర­ని సమా­చా­రం. ఈ ప్ర­శ్న­ల­పై కే­సీ­ఆ­ర్ ఇచ్చిన సమా­ధా­నా­లు ఈ కే­సు­లో తమ దర్యా­ప్తు­న­కు కీ­ల­కం­గా మా­ర­ను­న్నా­య­ని సిట్ అధి­కా­రు­లు భా­వి­స్తు­న్నా­రు.

ఇం­టె­లి­జె­న్స్ మాజీ చీఫ్ ప్ర­భా­క­ర్‌­రా­వు వ్య­వ­హా­రం కూడా సిట్ అధి­కా­రుల వి­చా­ర­ణ­లో ప్ర­ధాన అం­శం­గా మా­రిం­ది. పద­వీ­కా­లం ము­గి­సిన ప్ర­భా­క­ర్‌­రా­వు­కు మళ్లీ పద­వి­ని ఎం­దు­కు పొ­డి­గిం­చా­రు..? ఆ ని­ర్ణ­యం వె­నుక కా­ర­ణా­లు ఏంటి..? అంటూ కే­సీ­ఆ­ర్‌­ను సిట్ అధి­కా­రు­లు ప్ర­శ్నిం­చి­న­ట్లు తె­లి­సిం­ది. ఒకే వ్య­క్తి­కి రెం­డు కీలక పో­స్టు­లు ఎం­దు­కు..?, పరి­పా­ల­నా ని­య­మా­వ­ళి­కి వి­రు­ద్ధం­గా ఒకే వ్య­క్తి­కి రెం­డు కీలక బా­ధ్య­త­లు అప్ప­గిం­చ­డం­పై కూడా సిట్ అధి­కా­రు­లు ప్ర­శ్న­లు సం­ధిం­చా­రు. ఒకే వ్య­క్తి­కి రెం­డు కీలక పో­స్టు­లు ఎం­దు­కు అప్ప­గిం­చా­రు..?, అది ఫోన్ ట్యా­పిం­గ్ వ్య­వ­హా­రం­తో సం­బం­ధం ఉందా..? అనే కో­ణం­లో సిట్ వి­చా­రణ కొ­న­సా­గి­న­ట్లు సమా­చా­రం.

Tags:    

Similar News