H3N2 Virus : భారత్ లో మరో మరణం, ఏడుకు చేరిన మృతులు

రోగులు సొంతంగా మందులు వాడరాదని, యాంటీబయోటిక్స్ వాడటాన్ని నివారించాలని ప్రజలను కోరింది Indian Council of Medical Research

Update: 2023-03-14 07:04 GMT

భారత్ లో ఇన్ఫ్లూ ఎంజా ( H3N2) వైరస్ వ్యాపిస్తోంది. గుజరాత్ లో 58ఏళ్ల మహిళ ఇన్ఫ్లూ ఎంజా వైరస్ భారిన పడి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె వడోదరలోని SSG హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. భారత్ లో H3N2 వైరస్ తో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. దేశంలో మొదటిసారి కర్ణాటక హసన్ జిల్లాలో 82ఏళ్ల వ్యక్తికి వచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెలువరించిన డేటా ప్రకారం, జనవరి 2 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 కేసులు నమోదైనట్లు తెలిపారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, నెలాఖరు వరకు కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపారు. H3N2 వైరస్ కాలానుగుణంగా వ్యాపిస్తుందని... కేసుల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇన్ఫ్లూ ఎంజా (H3N2) వైరస్ వ్యాప్తిలో రోగులు సొంతంగా మందులు వాడరాదని, యాంటీబయోటిక్స్ వాడటాన్ని నివారించాలని ప్రజలను కోరింది Indian Council of Medical Research (ICMR). అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం H3N2 అనేది మానవేతర వైరస్ అని ఇది ముఖ్యంగా పందుల్లో వ్యాపించి మనుషులకు సోకుతుందని తెలిపారు. ఈ వైరస్ సోకినపుడు కాలానుగుణంగా ఫ్లూ వైరస్ మాదిరిగానే ఉంటుందని తెలిపారు. దగ్గు, ముక్కు కారటం, శ్వాస కోశ లక్షణాలు, బాడీ పేయిన్స్, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉండవచ్చని డాక్లర్లు తెలిపారు. 


Tags:    

Similar News