వృద్దులకు, పిల్లలకు హెయిర్ కటింగ్ ఫ్రీ

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ పూర్తి అస్తవ్యస్థమైపోయింది. దీంతో కేంద్రానికి చాలా మంది

Update: 2020-09-15 11:14 GMT

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ పూర్తి అస్తవ్యస్థమైపోయింది. దీంతో కేంద్రానికి చాలా మంది డొనేషన్లు కూడా ఇచ్చారు. పీఎం కేర్స్ ఫండ్ లోకి తమ విరాళాలు ఇచ్చారు. అయితే, ప్రభుత్వాని అందిన ఈ విరాళాలు ఎంతవరకూ ప్రజల వరకు వచ్చాయో తెలియదు కానీ.. కేరళలో ఓ బార్భర్ షాపు యజమాని.. కరోనా కష్ట కాలంలో తమ సేవలను ప్రత్యక్షంగా ప్రజలకు అందేలా ఓ ప్రకటన చేశారు. కొచ్చి కాత్రికాడవులోని గోపి అనే బార్బర్ షాపు యజమాని 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని తెలిపారు. తనకు ఉన్న మూడు షాపుల్లో ఈ ప్రకటన చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. కనుక తన వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నానని గోపి తెలిపారు. మామూలు సమయంలో 100 రూపాయలు తీసుకునే వాడినని.. కానీ, ఇప్పుడు 14 ఏళ్ల లోపు పిల్లలకి, వృద్దులకు ఉచితంగా చేస్తున్నానని తెలిపారు. పెద్దవారి నుంచి కూడా ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నానని అన్నారు. కరోనా సంక్షోభం ఉన్నంత వరకూ ఇదే విధంగా కొనసాగిస్తానని అన్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో బార్బర్ గోపి తీసుకున్న నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఔదర్యాన్ని వారు కొనియాడుతున్నారు.

Tags:    

Similar News