Miss Universe 2021: 21 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన మిస్ యూనివర్స్ టైటిల్..
Miss Universe 2021: మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఇండియన్ బ్యూటీ హర్నాజ్ సంధు కైవసం చేసుకున్నారు.;
Miss Universe 2021: మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఇండియన్ బ్యూటీ హర్నాజ్ సంధు కైవసం చేసుకున్నారు. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్-2021 పోటీల్లో హర్నాజ్ విజేతగా నిలిచారు. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం దక్కడంతో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు ఇది మూడో మిస్ యూనివర్స్ కిరీటం. 1994లో మొదటిసారి సుస్మితా సేన్ ఈ కిరీటాన్ని దక్కించుకోగా.. 2000లో లారాదత్తా.. మళ్లీ ఇప్పుడు హర్నాజ్ విశ్వ వేదికపై విజేతగా నిలిచారు.
హర్నాజ్ సంధు పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్, వెండితెరపై ఆసక్తితో ఆమె విద్యార్థి దశలోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేశారు. మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. సోషల్‌మీడియాలోనూ ఆమెకు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు.