Health: సమస్య ఏదైనా.. పరిష్కారం ఉందిగా...

ఆరోగ్య సమస్యలకు సులభమైన పరిష్కారాలను సూచిస్తున్న హెల్త్ డాట్ సంస్థ; ఒక్క క్లిక్ తో ఆరోగ్య సూత్రాలు...;

Update: 2023-02-13 09:47 GMT

ఆరోగ్య సమస్యలకు సులభమైన పరిష్కారాలు సూచించడంతో పాటూ, పలు వ్యాధుల గురించి సరళమైన వివరణ అందిస్తూ, ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా హెల్త్ డాట్ సంస్థ మరో అడుగు ముందుకువేసింది. క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను సైతం సులభంగా అర్ధం చేసుకోగలిగే వెసులుబాటు కల్పించడంతో పాటూ, ప్రజలకు తమ సమస్యల పట్ల పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఆన్ లైన్ హెల్త్ పోర్టల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యమే అత్యంత ప్రధానమైనదని, ప్రతి ఒక్కరూ తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా సేవలు అందిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడమే తమ లక్ష్యమని అన్నారు. అయితే ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను సూచించి వదిలేయడమే కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలని అన్న అంశాలపై వివరణ కూడా ఇవ్వనున్నారు. అత్యంత సులభంగా ప్రతి ఒక్కరికీ అర్ధమైయ్యే సరళమైన భాషలో ఆరోగ్య సూత్రాలను వెల్లడించబోతున్నట్లు పరమేశ్వరి తెలిపారు.

Tags:    

Similar News