Heavy Rain: భారీ వర్షం.. మ్యాన్ హోల్ లో పడిపోయిన భార్యాభర్తలు.. వీడియో వైరల్

Heavy Rain: ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో పౌర సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Update: 2022-06-20 05:46 GMT

Heavy Rain: ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో పౌర సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక పోలీసు, అతని భార్య ఆసుపత్రికి వెళుతుండగా, వారి స్కూటర్ వర్షపునీటితో మునిగిపోయిన మ్యాన్ హోల్ లో పడిపోయింది. సమయానికి స్థానికులు వారిని గమనించి రక్షించారు. దాంతో చిన్న చిన్న గాయాలతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దాంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జంట నీరు నిండిన రహదారిపై బైక్‌ను నడుపుతున్నప్పుడు వారి వాహనం అకస్మాత్తుగా తెరిచిన మ్యాన్‌హోల్ లో పడిపోయింది.

మ్యాన్‌హోల్ లో పడిపోయిన దంపతులను రక్షించడానికి స్థానికులు పరుగున వెళ్లి వారిని కాపాడారు. మ్యాన్ హోల్ లో పడి చిన్న చిన్న గాయలతో బయటపడిన పోలీసు దయానంద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. మేము స్కూటర్‌పై ఆసుపత్రికి వెళ్తున్నాము. డ్రెయిన్ తెరిచి ఉంది. వర్షం ధాటికి నీరు రోడ్లపై నిలిచి ఉంది. ఆ విషయం తెలియక స్కూటర్‌తో సహా అందులో పడిపోయాం. మా ఇద్దరికీ కొన్ని గాయాలయ్యాయి అని వివరించారు.

ముఖ్యంగా వర్షాకాలంలో పౌర సమస్యలతో తరచుగా ఇబ్బంది పడే రాష్ట్రంలో అలీఘర్ ఒకటి. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD (భారత వాతావరణ విభాగం) ఆదివారం తెలిపింది.

Tags:    

Similar News