Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో మూడు రోజులు..

Mumbai Rains: రానున్న మూడు రోజుల్లో ముంబయి అంతటా గరిష్ట వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

Update: 2022-07-12 05:40 GMT

Mumbai Rains: రానున్న మూడు రోజుల్లో ముంబయి అంతటా గరిష్ట వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. మహారాష్ట్రలోని పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, నాసిక్, పూణే, కొల్హాపూర్ మరియు గంచిరోలి సహా ఇతర జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

సోమవారం, ముంబై మరియు థానే ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. IMD ప్రకారం, రాబోయే 48 గంటల్లో 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులతో పాటు కొన్ని ప్రదేశాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ముంబై మినహా మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదైంది. ముంబై IMD అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, "ఇంతకుముందు, నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించినప్పుడు తక్కువ వర్షం కురిసింది. అయినప్పటికీ, అన్ని సినోప్టిక్ పరిస్థితులు భారీ వర్షపాతాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి రుతుపవనాలు ఎప్పుడైనా పుంజుకోవచ్చు అని తెలిపారు.

"రుతుపవనాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. సోమవారం, శాంతాక్రజ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 25.8 °C మరియు గరిష్టంగా 29.3 °C, సాపేక్ష ఆర్ద్రత 87 శాతంగా నమోదైంది. 

Tags:    

Similar News