తమన్నా బ్రేకప్.. ఆమె హార్ట్ బ్రోక్ చేసిన అతగాడెవరో..
ఆ విరహం నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు;
ముట్టుకుంటే మాసిపోయే సౌకుమార్యం.. నులివెచ్చని సూర్య కిరణాలు తాకినా మేని రంగు ఎర్రగా కందిపోవడం ఖాయం. మేకప్ మ్యాన్‌కి పని తక్కువగా కల్పించే తమన్నాకీ ఓ బ్రేకప్ స్టోరీ ఉందట. అందుకే ఆ విరహం నుంచి బయటపడేందుకు అప్పుడప్పుడు ఖాళీ దొరికితే చాలు కవితలల్లేస్తుంటుంది.. పుస్తకంలో ప్రబంధ కావ్యాలేవో రాసేస్తుంటుందట. అప్పుడు గానీ మనసు తేలికపడదని అంటోంది. మేని రంగు కన్నా మనసుకే ప్రాధాన్యం ఇస్తానంటోందీ అవంతిక.
ఒకప్పుడు అందాలు ఆరబోసే పాత్రల్లో నటించినా.. నట ప్రస్తానంలో పదిహేనేళ్ల పరిణతి అనంతరం అలాంటి వాటికి చెక్ పెట్టాలనుకుంటోంది. అందుకే సైరాలో ఓ బరువైన పాత్రకు సైన్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలకు అవకాశం వస్తే వెనకా ముందూ ఆలోచించకుండా ఓకే చేస్తానంటోంది. తమిళ, తెలుగు భాషల్లో వెబ్ సిరీస్‌లు చేస్తోన్న తమన్నా గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలనుకుంటోందట ఈ మిల్కీ బ్యూటీ. ఇకపై ఈ నిర్ణయాన్ని స్ట్రిక్ట్‌గా ఆచరణలో పెడతానంటోంది.. ఆల్ ద బెస్ట్.. తమ్మూ.. తెలుగు ప్రేక్షకులు నిన్ను ఈ విధంగా కూడా ఆదరిస్తారని ఆశిస్తూ..