కోలుకున్న అమిత్ షా.. త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం..
కోలుకున్న అమిత్ షా.. త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం..;
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చికిత్స పొందుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు.. త్వరలోనే ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఆగస్టు 2న కరోనా పరీక్షలు చేయించుకున్న అమిత్ షాకు పాజిటివ్'గా నిర్ధారణ అయ్యింది. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. 12 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అమిత్ షా.. కరోనా తగ్గడంతో ఈ నెల 14న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరోసారి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చేరారు.