హోండా కొత్త మోడల్ బైక్ 'హైనెస్ సీబీ 350'.. ఫీచర్లు చూస్తే..

రాబోయే పండుగల సీజన్ నుంచి వాహనాల విక్రయాలు జరుగుతాయని గులేరియా ప్రకటించారు.;

Update: 2020-10-01 07:07 GMT

ద్విచక్ర వాహనాల రంగంలో అగ్రగామిగా నిలిచిన హోండా మరో కొత్త మోడల్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోడ్రన్ క్లాసిక్ విభాగంలో హైనెస్ సీబీ 350 పేరుతో విడుదలైన ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు చెందిన బైక్‌కి పోటీ ఇవ్వనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనేక ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ బైక్స్‌ని జపాన్ నుండి తెప్పించిన పరికరాలతో మన దేశంలోనే హోండా కంపెనీ తయారు చేసింది. హెనెస్ సిబి 350 వాహనం ఎల్ ఎక్స్, ఎల్ ఎక్స్ ప్రో అని రెండు వేరియంట్లలో లభించనుంది.

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ బైక్స్ ను తయారు చేశామని సేల్స్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. రాబోయే పండుగల సీజన్ నుంచి వాహనాల విక్రయాలు జరుగుతాయని గులేరియా ప్రకటించారు. వాహన ఫీచర్ల గురించి వివరిస్తూ.. సీబీ 350 హైనెస్ ఒక సరికొత్త 348.36 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ మోటారును కలిగి ఉందన్నారు. బైక్ డిస్క్ బ్రేక్‌లో 17 అంగుళాల అలైవీల్స్, ట్యూబ్ లెస్ టైర్‌ను కలిగి ఉందన్నారు. RE క్లాసిక్ 350 మాదిరిగా, ఇది లాంగ్ స్ట్రోక్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. వాహనాల బుకింగ్ సేవలను ఆన్‌లైన్‌లో ప్రారంభించామని అన్నారు.

Similar News