India-China: డ్రాగన్ కవ్వింపు చర్యలు.. భారత వాయుసేన అలర్ట్
India-China: డ్రాగన్ కవ్వింపు చర్యలతో భారత వాయుసేన అలర్ట్ అయ్యింది. చైనాకు చెక్ పెట్టేందుకు వాయుసేన కొత్తవ్యూహాలు రచిస్తోంది.;
India-China: డ్రాగన్ కవ్వింపు చర్యలతో భారత వాయుసేన అలర్ట్ అయ్యింది. చైనాకు చెక్ పెట్టేందుకు వాయుసేన కొత్తవ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగానే యూపీలోని చాందీనగర్, భగ్‌పట్‌లో వాయుసేన రిహార్సల్స్ చేసింది. బోర్డర్‌లో ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కోవడంపై భారత సైన్యం దృష్టిపెట్టింది. తవాంగ్ ఘటనతో పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
పదేపదే చైనా కవ్వింపు చర్యలకు దిగడంతో భారత వాయుసేనతో పాటు.. బీఎస్‌ఎఫ్, సీఆర్‌ఎపీఎఫ్ కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే తూర్పు లదఖ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు బలగాలు మోహరించాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. అయితే తవాంగ్ ఘర్షణ తర్వాత ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.