India Corona : మళ్ళీ పెరిగిన కేసులు.. 285 మంది మృతి..!
India Corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,41,986 కేసులు నమోదయ్యాయి.;
India Corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే అదనంగా మరో 27 వేల కేసులు పెరిగాయి. ఇక కరోనా మహమ్మారితో పోరాడుతూ మరో 285 మంది మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య నాలుగు లక్షల 83 వేలకి చేరింది. ఇక పాజిటివ్ రేటు 9.28%పెరిగింది. కాగా ప్రస్తుతం దేశంలో నాలుగు లక్షల 72వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు మొత్తం మూడుకోట్ల నలభై నాలుగు లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.