Coronavirus In India : 65%పెరిగిన కరోనా కేసులు...!
Coronavirus In India : దేశంలో మళ్ళీ కరోనా విస్తరిస్తోంది. నిన్న 1,247 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,067 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి..;
Coronavirus In India : దేశంలో మళ్ళీ కరోనా విస్తరిస్తోంది. నిన్న 1,247 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,067 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.. నిన్నటితో పోలిస్తే 65 శాతం కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.
నిన్న దేశవ్యాప్తంగా ఒక్క కరోనా మరణం నమోదు కాగా, తాజాగా 40 మృతి చెందారు. దేశవ్యాప్తంగా కొత్తగా 1547 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 12,340 యాక్టివ్ కేసులున్నాయి. కాగా దేశంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం రికవరీల సంఖ్య 4,25,13,248 కి చేరుకుంది.
ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.