India corona Update :తస్మాత్ జాగ్రత్త : గడిచిన 24 గంటల్లో ఏకంగా 90,928 కేసులు..!
India corona Update : దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 90,928కరోనా కేసులు నమోదయ్యాయి.;
India corona Update : దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 90,928కరోనా కేసులు నమోదయ్యాయి. అటు కరోనాతో పోరాడి మరో 328మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 19,206 మంది కోలుకున్నారు. అంతకుముందు రోజు దేశవ్యాప్తంగా 58,097 కేసులు నమోదు కాగా తాజాగా మరో 30 వేల కేసులు పెరిగాయి. మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరుకుంది. ఇక ప్రస్తుతం పాజిటివిటీ 6.43 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,85,401యాక్టివ్ కేసులున్నాయి. అటు గురువారం నాటికి ఓమిక్రాన్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 2,630కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది.
India logs 90,928 new COVID-19 cases, positivity rate stands at 6.43 pc
— ANI Digital (@ani_digital) January 6, 2022
Read @ANI Story | https://t.co/OI68GOsK2H#India #COVID19 pic.twitter.com/rHm6GJrQhm