India corona cases : దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు..!

India corona cases : భారత్‌లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 81 రోజుల తరువాత 60వేల దిగువన పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Update: 2021-06-20 05:14 GMT

India corona cases : భారత్‌లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 81 రోజుల తరువాత 60వేల దిగువన పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58 వేల 419 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే 87వేల 619 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అటు మరణాల సంఖ్య కూడా కొన్ని రోజులుగా 1500 దగ్గరే ఉంటోంది. గత 24 గంటల్లో 1576 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3 లక్షల 86వేల 740కి చేరింది.

నిన్నటి లెక్కలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 98 లక్షల 81వేల మందికి పైగా కరోనా సోకింది. వీరిలో 2 కోట్ల 87 లక్షల మంది కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. ప్రస్తుతం భారత్‌లో 7 లక్షల 24వేల 413 కేసులు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు కూడా 2.4 శాతానికి పడిపోయింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 27 కోట్ల 66 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags:    

Similar News