గుడ్ న్యూస్.. జూన్‌లో మరో వ్యాక్సిన్!
కరోనా నియంత్రణ కోసం 2 వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో ఉండగా.. జూన్‌లో మరో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు.;
కరోనా నియంత్రణ కోసం 2 వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో ఉండగా.. జూన్‌లో మరో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు. USAకు చెందిన నోవావాక్స్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. 2021 జూన్ నాటికి ఈ వ్యాక్సిన్‌ను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పగా.. సీరం సంస్థ ఇప్పటికే కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది. ఈ నెల 16 నుంచి ఇండియా వీటి వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రారంభించింది. సుమారు 15 లక్షలమందికి పైగా హెల్త్ కేర్ వర్కర్లు, కొందరు డాక్టర్లు ఈ టీకామందులను తీసుకున్నారు.