Black Box : బ్లాక్‌బాక్స్ ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ ఆర్మీ..!
Black Box : తమిళనాడులోని కూనూరు సమీపంలో నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది.;
Black Box : తమిళనాడులోని కూనూరు సమీపంలో నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాద ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. వింగ్ కమాండర్ ఆర్. భరద్వాజ్ నేతృత్వంలోని వైమానిక దళ అధికారుల బ్లాక్ బాక్స్ తో పాటుగా మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డీకోడింగ్ కోసం బ్లాక్ బాక్స్ ఢిల్లీకి తరలించనున్నారు. సాధారణంగా అయితే బ్లాక్ బాక్స్ లో 13 గంటల డేటా స్టోర్ అయి ఉంటుంది. హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు అరగంట ముందు ఏం జరిగిందో తెలుస్తుంది.