మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. రాహుల్ తో పాటు పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. అధికారానికి ప్రతిరూపమైన ఆమె.. సమర్థవంతమైన ప్రధానమంత్రి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఆమె నాయకత్వ పటిమ గురించి దేశం మొత్తం ఇప్పటికీ మాట్లాడుతుందన్నారు. నానమ్మగా తనను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని.. ఆమె నేర్పించిన విషయాలు తనను ప్రేరేపిస్తాయని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.
एक कार्यकुशल प्रधानमंत्री और शक्ति स्वरूप श्रीमती इंदिरा गांधी जी की जयंती पर श्रद्धांजलि।
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2020
पूरा देश उनके प्रभावशाली नेतृत्व की आज भी मिसाल देता है लेकिन मैं उन्हें हमेशा अपनी प्यारी दादी के रूप में याद करता हूँ। उनकी सिखायी हुई बातें मुझे निरंतर प्रेरित करती हैं। pic.twitter.com/9RHDnAClOJ