ఎవరీ రిహన్న.. పాకిస్థానీనా.. గూగుల్లో ట్రెండింగ్ టాపిక్
"మేము దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు" అని ఆమె ట్వీట్ చేసింది.;
రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనపై మంగళవారం ట్వీట్ చేసినప్పటి నుండి పాప్ సింగర్ 'రిహన్న' దేశంలో అతిపెద్ద ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతుగా అంతర్జాతీయ గాయకురాలు, నటి, పారిశ్రామికవేత్త అయిన రిహన్న ట్వీట్ చేశారు.
భారత ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వందలాది మంది రైతుల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"మేము దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు" అని ఆమె ట్వీట్ చేసింది.
రిహన్న ఈ ట్వీట్‌ను షేర్ చేసిన వెంటనే, సింగర్ సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రతికూల, సానుకూల స్పందనలకు వేదికగా మారింది. చాలా మంది ఆమెకు మద్దతు ఇచ్చారు. రైతులకు మద్దతుగా ఆమె గొంతు వినిపించినందుకు ప్రశంసించారు. అయితే, దేశ విషయాలలో జోక్యం చేసుకున్నందుకు కొందరు ఆమెను ప్రశ్నించిన వారూ ఉన్నారు.
ముఖ్యంగా, రిహన్న గూగుల్‌లో కూడా ట్రెండ్ సెట్టర్ అయ్యింది. నెటిజన్లు అనేక ట్వీట్లు చేయగా, కొందరు ఆమె గురించి మొదటిసారి వింటున్నామని తెలిపారు. ఫలితంగా ఆమె గూగుల్‌లో వేట ప్రారంభమైంది. దీంతో 'రిహన్న టాపిక్‌గా నిలిచారు.' సాధారణ ప్రజలు సైతం ఆమె మతం ఏంటని శోధించారు. మరికొందరు ఆమె ముస్లిం మహిళ అయ్యుంటారని అనుమానం వ్యక్తం చేశారు.
'రిహన్న ముస్లిం?' 'రిహన్న మతం', 'రిహన్న' వంటి పదాలు అగ్రస్థానంలో ఉండగా 'రిహన్న పాకిస్తానీనా?' అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది.
రిహన్నతో పాటు, రైతుల నిరసనల గురించి ట్వీట్ చేసిన అనేక ఇతర అంతర్జాతీయ వ్యక్తులు గ్రేటా థన్‌బెర్గ్, హసన్ మిన్హాజ్, లిల్లీ సింగ్, జాన్ కుసాక్, అమండా సెర్నీ, మియా ఖలీఫా వంటి ప్రముఖులు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో సింగు సరిహద్దు వద్ద నిరసన తెలిపిన రైతులు కూడా పాప్ సింగర్ రిహన్నకు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ, "ఈ సాయంత్రం వరకు ఆమె ఎవరో మాకు తెలియకపోయినా, రిహన్నజీకి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని అన్నారు. మా వాళ్లు ఇప్పుడే మాకు ట్వీట్ చూపించారు. ఆమె ఎవరో మాకు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కోరుకుంటున్నారు మా స్వరానికి మద్దతు ఇచ్చినందుకు రిహన్నకు కృతజ్ఞతలు. "
మరోవైపు, రిహన్న ట్వీట్ చేసిన ఒక రోజు తర్వాత, బాలీవుడ్ తారలైన అజయ్ దేవ్‌గన్, కరణ్ జోహార్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ,అనిల్ కుంబ్లే వంటి క్రీడాకారులు భారతదేశ విధానాలకు మద్దతునిస్తూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
why aren't we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021