జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రెండు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు టెర్రరిస్టులను కశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. వరుసగా రెండు రోజులుగా ఈ రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో పోలీసులు చేపట్టిన కార్డన్ సర్చ్‌లో ఉగ్రవాదులు తారసపడ్డారు. వారు పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మంగళవారం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఏకే 47 రైఫిల్, మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన తీవ్రవాదులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.