JEE Main 2021 : జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..!
నిన్న నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసిన కేంద్రం.... తాజాగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసింది.;
కరోనా రెండో దశ ఉధృతితో దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. నిన్న నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసిన కేంద్రం.... తాజాగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసింది. కరోనా ప్రభావంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి పరీక్షల తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని.. పరీక్షలను ఇంటి నుండే రాసేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.