బిగ్ బ్రేకింగ్.. ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ

Update: 2020-12-16 11:53 GMT

ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీచేస్తూ సుప్రీంకోర్టు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియామకం కాగా.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకం అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా బదిలీ కాగా.. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.


Tags:    

Similar News