Karnataka Congress : కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి

Update: 2023-03-11 04:47 GMT


కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్   ధృవనారాయణ్ గుండెపోటుతో మరణించారు. శనివారం ఉదయం మైసూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ నాయకులు రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్ట్ చేశారు. "ఎప్పటికీ నవ్వూతూ ఉంటే మా స్నేహితుడు, నాయకుడు, కాంగ్రెస్ కు అత్యంత అంకితభావంతో కూడిన సైనికుడు ఎస్ ఓచ్. ధృవనారాయణ్ కోలుకోలేని నష్టాన్ని మిగిల్చారు" అని ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల కోసం. పేదల కోసం తన జీవితాన్ని ధృవనారాయణ్ అంకితం చేశారని అన్నారు. ధృవనాయణ్ మృతిచెందడంతో పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, శివకుమార్ లు సంతాపం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News