Umesh Katti: గుండెపోటుతో మృతి చెందిన కర్ణాటక మంత్రి..
Umesh Katti: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. 61 ఏళ్ల వయసులో అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.;
Umesh Katti: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. 61 ఏళ్ల వయసులో అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రి మృతి రాష్ట్రానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సంతాపం తెలిపారు.
మంత్రి తన ఇంటిలో ఛాతీ నొప్పిగా ఉందని చెప్పి కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ముఖ్యమంత్రి బొమ్మై మంత్రి ఉమేష్ మృతికి సంతాపం తెలియజేశారు. "నేను నాకు చాలా సన్నిహిత మిత్రుడిని కోల్పోయాను, అతను నాకు సోదర సమానుడు, అతనికి గుండె జబ్బు ఉంది. కానీ ఇంత త్వరగా చనిపోతాడని మేము అనుకోలేదు, రాష్ట్రానికి చాలా సేవ చేసాడు. అనేక శాఖలను నిర్వహించాడు. సమర్ధవంతుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని బొమ్మై అన్నారు.
పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బాగేవాడి బెలగావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంత్రి మృతికి సంతాప సూచకంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.