Kerala : 29 సంవత్సరాల తర్వాత ముస్లిం దంపతుల పునర్వివాహం

Update: 2023-03-07 13:48 GMT


కేరళకు చెందిన ఓ ముస్లిం దంపతులు తమ కుమార్తెల కోసం 29 సంవత్సరాల తర్వాత తిరిగి వివాహం చేసుకున్నారు. కెరళా కాసర్ గోడ్ కు చెందిన ప్రముఖ న్యాయవాది సి. షుకూర్, డాక్టర్ షీనాను అక్టోబర్ 1994లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని ఇండియన్ ముస్లిం లీగ్ నాయకుడు పానక్కాడ్ సయ్యద్ హైదర్ అలీ షిహాబ్ తంగల్ నిర్వహించారు. ఈ పెళ్లి ముస్లింల షరియా చట్టం ప్రకారం జరిగింది. ముస్లింల పర్సనల్ లా ప్రకారం, కుమార్తెలు వారి తండ్రి ఆస్తిలో మూడింట రెండు వంతులు మాత్రమే పొందే హక్కు ఉంది. మిగిలినది అతని సోదరులకు చెందుతుంది.


ఈ ముస్లిం దంపతులు తమ ఆస్తిని తమ పిల్లలకు మాత్రమే చెందాలనే ఉద్దేశంతో మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ వివాహం భారతీయ వారసత్వ చట్టానికి లోబడి ఉంటుంది. మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేరళలో ముస్లిం దంపతులు తిరిగి వివాహం చేసుకోనున్నారు. వీరిని ముగ్గురు ఆడపిల్లలు. వీరు కూడా తమ తల్లిదండ్రుల పెళ్లికి హాజరవనున్నారు.

Similar News