తమన్నా, కోహ్లీకి హైకోర్టు నోటీసులు!
గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా, టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ వివాదంలో కేరళ హైకోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది.;
గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా, టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ వివాదంలో కేరళ హైకోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాల్సిందిగా వీరికి బుధవారం నోటీసులు జారీ చేసింది.
వీరితోపాటు మాలీవుడ్ నటుడు అజు వర్గీస్‌కు కూడా హైకోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్ కోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఆన్‌లైన్ జూదం సైట్‌లకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నందుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియాల ను అరెస్టు చేయాలని కోరుతూ ఒక న్యాయవాది 2020 ఆగస్టులో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది అమాయక యువకుల ప్రాణాలను తీస్తోందని అయన పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ గేమ్‌కు ఎక్కువ మందిని ఆకర్షించడానికి బ్రాండ్ అంబాసిడర్లు ప్రధాన పాత్ర పోషించారని తన ఫిటిషన్ లో అభిప్రాయపడ్డారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకుని కోర్టు .. కోహ్లీ, తమన్నా మరియు అజు వర్గీస్‌లకు నోటీసులు ఇచ్చింది.