Kerala Lockdown : మే 8 నుండి కేరళలో సంపూర్ణ లాక్‌డౌన్
కోరనా తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విదిస్తున్నట్టుగా ప్రకటించింది.;
Kerala Lockdown : కోరనా తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విదిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. కేరళలో నిన్న(బుధవారం) ఒక్కరోజే 41,953 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అటు రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై సీఎం విజయన్ అధికారులతో చర్చించారు. కేరళ, కోజికోడ్, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం, అలప్పుజ, పాలక్కాడ్, తిరువనంతపురం, కన్నూర్, కొల్లం జిల్లాల్లో గత రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.