మాడిపోయిన మొదటి దోశ.. పట్టుదలతో మరో దోశ వేసిన ఖుష్బూ..!
ఎన్నికల ప్రచారం అంటేనే లెక్కలేనన్ని జిమ్మిక్కులు... చెప్పలేనన్ని వింతలు. తమిళనాడు ప్రచారంలో ఇలాంటి చిత్రాలు కావాల్సినన్ని దొరుకుతున్నాయి.;
ఎన్నికల ప్రచారం అంటేనే లెక్కలేనన్ని జిమ్మిక్కులు... చెప్పలేనన్ని వింతలు. తమిళనాడు ప్రచారంలో ఇలాంటి చిత్రాలు కావాల్సినన్ని దొరుకుతున్నాయి. చెన్నై థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సినీనటి ఖుష్బూ... ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ టిఫిన్ సెంటర్‌లో దోశలు వేశారు. దోష వేయడం వరకైతే బాగానే వేశారు గానీ... దానికి నూనె రాయడం మర్చిపోయారు. అలాగే పక్కనున్న దోశలను తీసేందుకు ప్రయత్నించడంతో.. ఆమె వేసిన దోష మాడిపోయింది. అయితే అంతటితో వదిలేయకుండా మరోసారి పట్టుదలతో ప్రయత్నించారు ఖుష్బూ. ఈ సారి పద్ధతి సరిగ్గా ఫాలో అయి పర్ఫెక్ట్‌గా దోశ వేశారు.