కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి!
కరోనా మహమ్మరి ఎవరిని వదలడం లేదు.. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు.;
కరోనా మహమ్మరి ఎవరిని వదలడం లేదు.. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా కేరళకు చెందిన సీపీఎం ఎమ్మెల్యేను కరోనా బలి తీసుకుంది. కొంగడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీ విజయదాస్ కరోనాతో మృతి చెందారు. డిసెంబర్ 11న కరోనాతో ఆస్పత్రిలో చేరిన విజయదాస్.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.
విజయదాస్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు పండాళం సుధాకరణ్ పై, విజయదాస్ 13 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేవీ విజయదాస్ కు భార్య ప్రేమకుమారి, ఇద్దరు కుమారులు జయదీప్, సందీప్ ఉన్నారు.