Lalu Prasad Yadav : ఒక్కసారిగా క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు తరలింపు..!

Lalu Prasad Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం ఒక్కసారిగా క్షీణించింది.;

Update: 2022-03-22 11:15 GMT

Lalu Prasad Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం ఒక్కసారిగా క్షీణించింది. దీనితో ఆయనని మంగళవారం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. గుండె మరియు కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపుతున్నట్లుగా జైలు అధికారి కామేశ్వర ప్రసాద్ తెలిపారు. ఇదిలావుండగా దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న యాదవ్ కి ఏప్రిల్ 1 వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన ఫిటిషన్ ను మార్చి 11న జార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరిలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టు దాణా కుంభకోణం కేసులో యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష రూ. 60 లక్షల జరిమానా విధించింది.

Similar News