Pullela Gopinchand: దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న పుల్లెల గోపీచంద్‌

Pullela Gopinchand: మాజీ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్, భారతదేశపు చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకున్నారు.

Update: 2022-07-02 05:12 GMT

Pullela Gopichand: మాజీ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్, భారతదేశపు చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రతిష్టాత్మక 10 సంవత్సరాల దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. దుబాయ్ గోల్డెన్ వీసా పొందిన మొదటి ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా గోపీచంద్ నిలిచాడు. దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇచ్చినందుకు గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇది గల్ఫ్‌లో పని చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. గత సంవత్సరం దుబాయ్‌లో ప్రారంభించిన బ్యాడ్మింటన్ అకాడమీని అరబ్ దేశాలకు విస్తరింపజేస్తామన్నారు. పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ రిటైర్ అయ్యాక 2008లో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించారు. సైనా నెహ్వాల్, P. V. సింధు, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ కిదాంబి, అరుంధతీ పంతవానే, గురుసాయి విష్ణు దత్ వంటి పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేశారు.

సైనా నెహ్వాల్ 2012 సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. P.V. సింధు 2016 సమ్మర్ ఒలింపిక్స్ లో రజత పతకాన్ని, మహమ్మారి-హిట్ 2020 సమ్మర్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2016 బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలింపిక్స్ లో పుల్లెల గోపీచంద్ అధికారిక భారత ఒలింపిక్ బ్యాడ్మింటన్ టీమ్ కోచ్‌గా పనిచేశాడు. గోల్డెన్ వీసాను 2019లో యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇది పెట్టుబడిదారులు (కనీసం AED 10 మిలియన్లు), వ్యవస్థాపకులతోపాటు సైన్స్, నాలెడ్జ్ , స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేస్తోంది. ఇప్పటివరకు ఫుట్‌బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, పాల్ పోగ్బా, రాబర్టో కార్లోస్, లూయిస్ ఫిగో, రోమెల్ లుకాకు, టెన్నిస్ సూపర్ స్టార్ నోవాక్ జొకోవిచ్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ దుబాయ్ గోల్డెన్ వీసా పొందిన వారిలో ఉన్నారు. బాలీవుడ్ స్టార్స్ షా రుఖ్ ఖాన్, సంజయ్ దత్ సైతం ఈ వీసాలను అందుకున్నారు.

Tags:    

Similar News